- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పీపీఈ కిట్లు వేసుకుని బంగారం చోరీ
X
ముంబయి : మహారాష్ట్రకు చెందిన కొందరు దొంగలు కొవిడ్ మహమ్మారి పంజా విసురుతున్నా దోపిడీలు మాత్రం మానలేదు. అంతేకాదు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు ధరించి మరి ఓ బంగారు దుకాణంలోకి చొరబడి 780 గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. మహారాష్ట్ర సతారా జిల్లాలోని ఓ జువెల్లరీ షాప్ గోడ పగులగొట్టి షోకేస్, కప్‌బోర్డుల నుంచి ఆభరణాలను దొంగిలిస్తున్న చిత్రాలను పోలీసులు సీసీ టీవీల్లో గుర్తించారు. డిస్‌ప్లే నుంచి నగలు చోరీలకు పాల్పడుతున్నవారు పీపీఈ కిట్లు ధరించినట్టు కనిపించారని పోలీసులు తెలిపారు. తమ షాపులో 78 తులాల బంగారం పోయిందని షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కరోనా అనంతరం ప్రపంచం భిన్నంగా ఉంటుందన్న నేతల మాటలను పేర్కొంటూ కొందరు ఈ ఘటన పై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
Advertisement
Next Story