ఫ్యాన్‌కు బన్నీ సర్‌ప్రైజ్

by Shyam |
ఫ్యాన్‌కు బన్నీ సర్‌ప్రైజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకసారైనా తమ ఫేవరెట్ హీరోని కలవాలని, ఫొటో దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ప్రతి ఫ్యాన్ కోరుకుంటాడు. అలాంటి అవకాశం ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. అలా తన అభిమాన నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలని కోరుకున్నాడు ఓ చిన్నారి ఫ్యాన్. క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ చిన్నారి అభిమాని కోరిక నెరవేర్చాడు బన్నీ..ఆ వీడియా సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరలవుతోంది.

హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో అల్లు అర్జున్‌ అభిమాని అయిన ఓ పిల్లాడున్నాడు. తనకు బన్నీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని కోరిక. విషయాన్ని తెలుసుకున్న బన్నీ..తనయుడు అల్లు అయాన్‌ ద్వారా ఆ చిన్నారి అభిమానికి తన ఆటోగ్రాఫ్‌ను పంపడమే కాకుండా..అక్కడున్న మిగతా పిల్లలందరికీ కూడా బహుమతులను పంపి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆ చిన్నారి అభిమాని బన్నీ నుంచి వచ్చిన ఈ సర్‌ప్రైజ్ చూసి ఎంతో సంతోషించాడు.

Advertisement

Next Story