విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోరా..?

by Shyam |   ( Updated:2021-04-02 00:50:33.0  )
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోరా..?
X

దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వ నోటిఫికేషన్లు రాక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడం లేదంటూ కేయులో కొద్ది రోజుల క్రితం పురుగుల మందు తాగి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సునీల్ కుటుంబ సభ్యులను సంజయ్ శుక్రవారం పరామర్శించారు.

రాష్ట్రంలో విద్యార్థులు,నిరుద్యోగుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న సునీల్ కుటుంబ సభ్యులను చూస్తే బాధ కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకెంత మంది విద్యార్థులు, నిరుద్యోగులు చనిపోతే స్పందిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో కెసీఆర్ కు ఉద్యోగం ఉందని, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడు,చివరకు సడ్డకుని కొడుకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, మరి కష్టపడి చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం లేదా అని నిలదీశారు. సునీల్ మాదిరే రాష్ట్రంలో ఎంతో మంది పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా ఆయన సర్కారులో చలనం లేదన్నారు. చనిపోయిన విద్యార్థి సునీల్ మరణవాంగ్మూలంలో తన చావుకు ముఖ్యమంత్రి కెసీఆర్ కారణమని చెప్పాడని, సునీల్ స్టేట్మెంట్ తోనే నిరుద్యోగుల్లో ఏ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందో స్పష్టమైందన్నారు.

Advertisement

Next Story