రియల్ హీరో కు..బంపర్ గిఫ్ట్…

by Shamantha N |
రియల్ హీరో కు..బంపర్ గిఫ్ట్…
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల తన ప్రాణాలకు తెగించి ఓ చిన్నారిని కాపాడిన రియల్ హీరోకు బహుమతి వరించింది. మహారాష్ట్రలోని వాంగని రైల్వే స్టేషన్ లో తన తల్లితో ప్లాట్ ఫాం పై వెళ్తున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడిపోయింది. అది గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే తన ప్రాణాలకు తెగించి ఆ చిన్నారిని కాపాడాడు. ఈ సంఘటనతో మయూర్ షేల్క్ కు జాతీయస్థాయిలో ప్రశంసలు రావడమే కాకుండా, రూ. 50 వేల నగదు బహుమతిని కూడా అందించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో చూసిన జావా మోటార్ సైకిల్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా ఓ బైక్ ఇస్తానని ప్రకటించారు. తను మాట ఇచ్చినట్టుగా రియల్ హీరో మయూర్ కు జావా 42 మోడల్ బైక్ ను ప్రదానం చేశారు. మయూర్ ఇంటికే జావా కంపెనీ సిబ్బంది వెళ్లి బైక్ ఇవ్వడం విశేషం.

Advertisement

Next Story