వాయిదాల్లో బిల్డింగ్ పర్మిషన్ ఫీజు చెల్లింపులు

by Shyam |
వాయిదాల్లో బిల్డింగ్ పర్మిషన్ ఫీజు చెల్లింపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రియల్ ఎస్టేట్స్ వ్యాపారాన్ని ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిల్డింగ్ పర్మిట్, అభివృద్ధి, క్యాపిటైజేషన్ ఫీజులను ఆరు నెలలకోసారి 4వాయిదాల్లో చెల్లించేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ సోమవారం జీఓ 197ను విడుదల చేసింది. బిల్డర్లు, డెవలపర్లు ఒకేసారి చెల్లింపులు చేస్తే ఎర్లీ బర్డ్ కింద 5% రాయితీ లభిస్తుంది. వాయిదాల్లో చెల్లించేవారు ఇచ్చే చెక్కులు బౌన్స్ అయితే 12% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. కరోనా ప్రభావంతో ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం కుదేలయింది. ఈ నేపథ్యంలో క్రెడాయ్, టీబీఏ, టీబీఎఫ్ రాయితీల కోసం ప్రభుత్వానికి విన్నవించాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఫీజులను వాయిదాల్లో చెల్లింపులు చేసే విధంగా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed