ట్రైలర్‌కే ఎంపీలు జంప్.. బొమ్మ పడితే పార్టీ ఖాళీ

by srinivas |
ట్రైలర్‌కే ఎంపీలు జంప్.. బొమ్మ పడితే పార్టీ ఖాళీ
X

దిశ, ఏపీ బ్యూరో: ట్రైలర్‌కే భయపడుతున్నారు. నాలుగేళ్ల సినిమా ముందుందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు బుద్దా ట్వీట్ చేస్తూ “వైఎస్ జగన్ గారి ఏడాది పాలన ట్రైలర్ మాత్రమే అంటున్నారు మామ విజయసాయి రెడ్డి. నిజమే ట్రైలర్ కే ఎంపీలు జంప్, మంత్రుల అసంతృప్తి, ఎమ్మెల్యేలు ధర్నాలు, నిరసనలు.ఇక అసలు బొమ్మ పడితే వైకాపా ఖాళీ. మామా, అల్లుడికి చంచల్ గూడా జైలులో చిప్పకూడు ఖాయం” అని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed