2018 నుంచి పోలీసులు నిద్రపోతున్నారా: రవి

by srinivas |
2018 నుంచి పోలీసులు నిద్రపోతున్నారా: రవి
X

దిశ,వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీగా ఉన్న తనను అంతర్జాతీయ నేరస్తుడిలా పట్టుకున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. దేశం విడిచి పారిపోతున్నట్టు వెంబడించి పట్టుకోవడం భావ్యం కాదన్నారు. వంగలపూడి అనితపై ఎస్సీ కేసు నమోదు చేయడం వింతగా ఉందని చెప్పారు. 2018 నాటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. 2018 నుంచి పోలీసులు నిద్రపోతున్నారా అని మండిపడ్డారు. దళిత మహిళకు మద్దతు ఇస్తే తనపై కేసులు పెట్టారని తెలిపారు. అరెస్ట్‌లు తమకు కొత్తేమి కాదన్నారు. ఇలాంటి కేసులకు తాము భయపడేదే లేదన్నారు. పార్టీ కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్దమేనని అన్నారు.

Advertisement

Next Story