BSP అధినేత్రి మాయవతి ఇంట్లో తీవ్ర విషాదం

by Shamantha N |   ( Updated:2021-11-13 21:12:53.0  )
BSP అధినేత్రి మాయవతి ఇంట్లో తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్ : బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP) అధ్యక్షురాలు మాయావతి మాతృమూర్తి రాంరతి (92) మరణించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం రోజు తుది శ్వాస విడిచినట్లు పార్టీ వెల్లడించింది. గతేడాది నవంబర్ 19న మాయావతి తండ్రి ప్రభుదయాల్ మరణించారు. ఆయన మరణించి ఏడాది కూడా గడవకముందే తల్లి మరణించడం తో మాయావతి తీవ్ర విషాదంలో మునిగారు. ఈ విషయమై బీఎస్‌పీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘అత్యంత దు:ఖకరమైన వార్త. బీఎస్‌పీ జాతీయ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయావతి తల్లి రాంరతి కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. తల్లి అంత్యక్రియల నిమిత్తం కుమారి మాయావతి ఢిల్లీకి బయలుదేరారు’’ అని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Advertisement

Next Story