భారత్​ బంద్​కు మాయావతి మద్దతు

by Shamantha N |   ( Updated:2021-09-26 03:45:19.0  )
భారత్​ బంద్​కు మాయావతి మద్దతు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకువ‌చ్చిన న‌ల్ల చ‌ట్టాల‌కు వ్యతిరేకంగా సోమ‌వారం త‌ల‌పెట్టిన భార‌త్ బంద్‌కు బీఎస్పీ చీఫ్ మాయావతి సంపూర్ణ మ‌ద్దతు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆమె సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. రైతు సంఘాలు, పార్టీ నాయ‌కులు, కార్యకర్తలు శాంతియుతంగా బంద్‌లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని ఆమె పిలుపు ఇచ్చింది. కేంద్రం హడావుడిగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలంటూ ఆమె కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడింది.

కేంద్రానికి రైతులపై ప్రేమ ఉంటే వెంటనే నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. రైతులతో కేంద్రం సరైన సంప్రదింపులు జరిపి వారి ఒప్పందంతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని, తద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుందని కేంద్రానికి సూచించింది. రైతు సంతోషంగా, సంపన్నంగా ఉంటే దేశం కూడా సంతోషంగా, సంపన్నంగా మారుతుందని ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed