బీరు బాటిళ్లతో కిరాతకంగా గొంతు కోసి..

by Sumithra |
బీరు బాటిళ్లతో కిరాతకంగా గొంతు కోసి..
X

దిశ, శేరిలింగంపల్లి : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిపై గుర్తు తెలియని దుండగలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్ద లింకు రోడ్డులో శుక్రవారం రాత్రి ఈఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉండే విజయ్ కుమార్ తన విధులను ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడిచేసి బీరు బాటిళ్ళతో కిరాతకంగా గొంతు కోశారు.

ఈ ఊహించని పరిణామంతో బాధిత యువకుడు పెద్ద పెట్టున కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనా ప్రాంతంలో ఉన్న సిసిటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సీఐ క్యాస్ట్రో తెలిపారు.

Advertisement

Next Story