దారుణం.. తల్లి, తమ్ముడిని కిరాతకంగా హత్య చేసిన అన్న

by Sumithra |
murder, Kandagatla village
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో తమ్ముడు తూర్పటి శ్రీను(30), తల్లి తూర్పటి మారమ్మ(70) లను అన్న లక్ష్మయ్య కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామంలో చోటుచేసుకుంది. తల్లీతమ్ముడ్ని హత్య చేసిన నిందితుడు లక్ష్మయ్య పరారీలో ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story