- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమృత – ప్రణయ్ ఘటనను తలపించేలా
దిశ, వెబ్ డెస్క్ : 2019లో మిర్యాలగూడలో ప్రణయ్ హత్య సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్, అమృతలపై కక్ష పెంచుకొని… ఆమె తండ్రి కిరాయి హంతకులతో దారుణంగా ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఆ దారుణం మరువక ముందే ఆదోనిలో మరో దారుణం జరిగింది.
కర్నూల్ జిల్లాలో ప్రేమ వివాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నందవరం మండలం గురజాల గ్రామానికి చెందిన చిన్నలాజర్, సువార్తమ్మల కొడుకు బుడ్డన్న అలియాస్ ఆడమ్ స్మిత్ (34) ఫిజియోథెరపిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అదేగ్రామానికి చెందిన ఈరన్న, లక్ష్మి దంపతుల కుమార్తె మహేశ్వరి డిగ్రీ చదవి నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటుంది. ఆడమ్ స్మిత్ – మహేశ్వరిలు గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం తెలుసుకున్న మహేశ్వరి కుటుంబసభ్యులు ఆమెకు వివాహం జరిపించేందుకు పెళ్లి సంబంధాలుచూస్తున్నారు.పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆడమ్ స్మిత్ – మహేశ్వరిలు 2020 నవంబరు 11న కర్నూల్ నుంచి హైదరాబాద్ కు వచ్చి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం మహేశ్వరి కుటుంబ సభ్యులకు తెలిసింది. కూతురుని కులాంతర వివాహం చేసుకున్నాడని తెలిసి ఆడమ్‌పై మహేశ్వరి తల్లిదండ్రులు కక్ష పెంచుకున్నారు. దీంతో భయాందోళనకు గురైన నవదంపతులు ఎస్పీ ఫక్కీరప్పను ఆశ్రయించారు. ఎస్పీ ఫకీరప్ప ఇరు కుటుంబ సభ్యలను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు.
అనంతరం ఆడమ్ స్మిత్ – మహేశ్వరిలు ఆదోనిలో విట్టా కిష్టప్ప నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తున్న ఆడమ్ ఎప్పటిలాగే విధులు ముగించుకొని గురువారం మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తుండగా.. బాధితుడి బైక్‌ను వెండించిన దుండగులు బండరాయితో మోది దారుణంగా హతమార్చారు. అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాధితుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు తాను కులాంతర వివాహం చేసుకున్నందుకే తన భర్త ఆడమ్ స్మిత్‌ను తన తండ్రి చిన్న ఈరన్న, పెద్దనాన్న పెద్ద ఈరన్నలు హత్య చేశారని బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుల్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.