తమ్ముళ్ల పైశాచికం.. నిద్రపోతున్న అన్నను ఏం చేశారంటే?

by  |   ( Updated:2021-07-14 23:20:02.0  )
తమ్ముళ్ల పైశాచికం.. నిద్రపోతున్న అన్నను ఏం చేశారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని గొల్లపల్లిలో నిద్రపోతున్న అన్నను తమ్ముళ్లు రోకలి బండతో కొట్టిచంపడం తీవ్ర కలకలం రేపింది. అన్న కృష్ణా రెడ్డికి, తమ్ముళ్లకు మధ్య కొన్నాళ్లుగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పక్కా పథకం ప్రకారం.. నిద్రపోతున్న కృష్ణా రెడ్డిని బుధవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. దాడిలో కృష్ణా రెడ్డి భార్యాపిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story