చెల్లిని గర్భవతిని చేసిన అన్న.. విషయం బయటకు రావడంతో..

by Sumithra |   ( Updated:2021-08-23 02:50:22.0  )
చెల్లిని గర్భవతిని చేసిన అన్న.. విషయం బయటకు రావడంతో..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ గిరిజన మైనర్ బాలిక శీలం ఖరీదును తండా పెద్దలు రూ. 8 లక్షలకు లెక్కగట్టారు. వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధి బొత్తలతండాకు చెందిన ఓ మైనర్‌ బాలికను అదే తండాకు చెందిన ఓ వివాహిత వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు.

అయితే సదరు మైనర్‌కు అతడు సోదరుడి వరుస కావడం సంచలనంగా మారింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పెద్దమనుషులను సంప్రదించారు. ఈ క్రమంలో వారు ఇరువురిని పిలిపించి మాట్లాడి గర్భవతిని చేసిన సదరు వ్యక్తి.. మైనర్‌కు రూ.8లక్షలు పరిహారం చెల్లించాలని పెద్దమనుషులు తీర్మానం చేసినట్లు తెలిసింది.

Advertisement

Next Story