దారుణం.. ఆ పని చేయాలని చెల్లెలిపై దాడి చేసిన సొంత అన్నా, వదిన

by Sumithra |   ( Updated:2021-11-18 22:08:10.0  )
brother-beaten-jhis-sister
X

దిశ, తాండూరు: భార్య మాటలు విని సొంత చెల్లెలిని తీవ్రంగా కొట్టాడు ఓ కసాయి అన్న. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్ గుర్తి గ్రామానికి చెందిన వడ్ల మహేశ్వరిని భర్త వదిలివేయడంతో తల్లి గారి ఇంటి వద్ద అన్నా, వదినతో ఉంటుంది. రోజూ కూలి పని చేసుకుంటూ జీవిస్తోంది. గురువారం ఎందుకు కూలి పనికి వెళ్లలేదు అంటూ వదిన లక్ష్మి తీవ్రంగా దూషిస్తూ మహేశ్వరిపై దాడి చేసింది. తన భర్త రాగానే లేనిపోనివి చెప్పి మహేశ్వరిపై భర్తకు కోపం వచ్చేలా చేసింది. భర్త కూడా దూషించి కట్టెలతో ఆమెపై దాడి చేసి ఇంట్లో నుంచి బయటికి గెంటివేశాడు. తీవ్రగాయాలతో నెమ్మదిగా నడుచుకుంటూ తాండూరుకు చేరుకుంది.

ఇది గమనించిన స్థానికులు విషయం తెలుసుకున్నారు. వెంటనే 181 సఖి కేంద్రానికి ఫోన్ చేశారు. రెండు గంటలైనా సఖి కేంద్రం వాళ్లు ఎవరూ స్పందించకపోవడంతో స్థానిక కౌన్సిలర్ కు సమాచారం అందించారు. స్థానిక బీజేపీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లడంతో కౌన్సిలర్ అక్కడికి చేరుకుని సఖి కేంద్రానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వాపోయారు. రాష్ట్రంలోని వాణిజ్య కేంద్రంగా వెలుగొందుతున్న తాండూరు ప్రాంతంలో వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు.. ఇలాంటి తాండూరులో సఖి కేంద్రం లేకపోవడం బాధాకరమని ప్రజలు వాపోతున్నారు.

Advertisement

Next Story