- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమి వివాదం.. అన్నను చంపిన తమ్ముడు
దిశ, నిజామాబాద్: అన్నదమ్ముల మధ్య ఉన్న భూమి పంపకం విషయంలో జరిగిన గొడవలో తమ్ముడు అన్నను కొడవలితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం తిప్పాపూర్‌లో బుధవారం రాత్రి జరిగింది. వివరాళ్లోకి వెళితే… భిక్నూర్ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన రాజయ్య, శంకర్లు అన్నదమ్ములు. ఇద్దరికీ వారసత్వంగా వచ్చిన భూమి విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు అర్ధరాత్రి వరకూ మద్యం సేవిస్తూ.. భూమి గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలో రాజయ్యకు కొడుకులు లేని కారణంగా రాజయ్య భూమి కూడా తనకే చెందుతుందని తమ్ముడు శంకర్ వాదించాడు. అందుకు ఒప్పుకోని రాజయ్య శంకర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో మద్యం మత్తులో ఆగ్రహానికి గురైన శంకర్, రాజయ్య మీద అదే రాత్రి కొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రాజయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. శంకర్ అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు లొంగిపోయాడు. తాను తన అన్నను చంపినట్టు తెలుపడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.