చిన్నారుల సేద్యం.. నలుగురికి ఆదర్శం

by Anukaran |
చిన్నారుల సేద్యం.. నలుగురికి ఆదర్శం
X

దిశ, మునుగోడు: ఆడుకోవాల్సిన వయసులో కాడేద్దులు చేతబట్టి సేద్యం చేస్తూ.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఓ అన్నాచెల్లి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం రేవల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోన్రెడ్డి శివలింగము-పార్వతమ్మ దంపతులకు వైష్ణవి(10), అరుణ్ కుమార్(14) ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో పత్తి పంటను సాగు చేశారు.

అయితే తండ్రి శివలింగంకు గత కొద్దిరోజులుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. సాగు చేసిన పత్తి చేనులో కలుపు పెరిగింది. దీంతో ఆరోగ్యం సహకరించని శివలింగం ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతూ ఉంటే.. కరోనా ప్రభావంతో స్కూలు లేక ఇంటివద్దే ఉంటున్న తన పిల్లలు వైష్ణవి, అరుణ్ కుమార్ ఎద్దుల సహాయంతో చేనులో గుంటక తోలుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Advertisement

Next Story

Most Viewed