బాయ్‌ఫ్రెండ్‌తో బ్రిట్నీ స్పియర్స్ ఎంగేజ్మెంట్.. వీడియో వైరల్

by Shyam |
Britney Spears
X

దిశ, సినిమా : పాప్ ప్రిన్సెస్ బ్రిట్నీ స్పియర్స్.. బాయ్ ఫ్రెండ్ సామ్ అస్ఘరీతో నిశ్చితార్థం అయిపోయినట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అనౌన్స్ చేసింది. ఈ క్లిపింగ్‌లో సామ్‌ను ముద్దాడుతూ ఎంగేజ్మెంట్ రింగ్ చూపించిన భామ.. తనను తానే నమ్మలేకపోతున్నట్లు తెలిపింది.కాగా ఇప్పటి వరకు ఈ పోస్ట్‌ను 2.5 మిలియన్ పీపుల్‌ లైక్ చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఇక 2016లో ఈ కపుల్స్ ‘స్లంబర్ పార్టీ’ మ్యూజిక్ వీడియో కోసం ఫస్ట్ టైమ్ మీట్ కాగా.. అప్పటి నుంచే రిలేషన్‌షిప్ స్టార్ట్ అయింది. కానీ స్పియర్స్.. తన తండ్రి కన్జర్వేటివ్‌షిప్‌లో ఉండటంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేకపోయింది. అయితే ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటానని తండ్రి ప్రకటించిన కొద్ది రోజులకే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగడం విశేషం. ఈ న్యూస్‌తో హ్యాపీగా ఫీలవుతున్న బ్రిట్నీ స్పియర్స్ ఫ్యాన్స్.. ఇన్నాళ్లకు ఫ్రీడమ్‌ పొందిన తమ ఫేవరేట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

https://www.instagram.com/reel/CTvOjVsMPJe/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story