అరుదైన కేసు: భార్యతో శృంగారం చేస్తుండగా రెండుగా చీలిన పురుషాంగం

by Shyam |   ( Updated:2021-07-03 01:20:25.0  )
bmj rare case
X

దిశ, వెబ్‌డెస్క్: శృంగార జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. వాటి గురించి డాక్టర్ ల దగ్గరకు వెళ్లడంలో తప్పులేదు. ఆ సమస్యలు ఎవరో ఒకరి విషయంలో డాక్టర్లు చూసినవే అయి ఉంటాయి. ఎవరి విషయంలోనూ తలెత్తని సమస్యలు రావడం చాలా అరుదు. అయితే డాక్టర్లే షాక్ అయ్యే ఒక అరుదైన కేసు బ్రిటన్ లో వెలుగుచూసింది. భార్యతో శృంగారం చేస్తున్న ఓ వ్యక్తి పురుషాంగం మూడు సెంటీమీటర్ల పొడువున నిలువునా చీలిపోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది.

వివరాలలోకి వెళితే.. బ్రిటన్ కి చెందిన ఓ వ్యక్తి (40) ఇటీవల తన భార్యతో కలిసి సెక్స్ లో పాల్గొన్నాడు. సెక్స్ చేసే సమయంలో అతనికి కొద్దిగా నొప్పి ఏర్పడింది. కానీ దాన్ని లైట్ తీసుకున్న ఆ వ్యక్తి శృంగారాన్ని కంటిన్యూ చేశాడు. ఆ తరువాత కూడా పురుషాంగంలో నొప్పి రావడంతో తప్పక డాక్టర్లను సంప్రదించాడు. డాక్టర్లు కూడా అతడి సమస్య సాధారణంగా ఏర్పడే సమస్యల్లో ఒకటే అని అనుకున్నారు. కొద్దిగా వాపు ఉండడంతో అతడికి స్కాన్ తీసి చూసి ఒక్కసారిగా ఖంగు తిన్నారు. అతడి పురుషాంగం లోపల మూడు సెంటిమీటర్ల నిలువు చీలిక ఏర్పడింది. దీన్ని చూసి షాక్ తిన్న డాక్టర్లు ఇలాంటి కేసు ఇంతకుముందు ఏమైనా జరిగిందా అని సెర్చ్ చేస్తే ఎక్కడా జరగలేదు.

అసలు ఎందుకు ఇలా జరిగిందని డాక్టర్లు పరిశోధన మొదలుపెట్టారు. అతను శృంగారం చేసే సమయంలో ట్యునికా అల్బుజినియా రెండుగా చీలిందని, ఆ విషయం అతనికి కూడా తెలియకపోవడంతో అది ఇంకా చీరుకుపోయిందని డాక్టర్లు తెలిపారు. అతనికి సర్జరీ చేశామని, మరో ఆరు నెలల తర్వాత ఆ వ్యక్తి శృంగారంలో పాల్గొనవచ్చని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు వివరాల్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ)లో రాయడంతో వైరల్ గా మారింది.

Advertisement

Next Story