బిహైండ్ ద సీన్స్‌తో ‘పొన్నియిన్ సెల్వన్‌’కు క్రేజ్

by Jakkula Samataha |   ( Updated:2021-02-07 02:54:30.0  )
బిహైండ్ ద సీన్స్‌తో ‘పొన్నియిన్ సెల్వన్‌’కు క్రేజ్
X

దిశ, సినిమా: ప్రముఖ దర్శకుడు మణిరత్నం అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ గురించి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. రాజ రాజ చోళుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పాపులర్ యాక్టర్స్ స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష కృష్ణన్, కీర్తి సురేశ్ లాంటి నటులు ఈ చిత్రంలో భాగం అవుతుండటం, పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో ఆడియన్స్ అటెన్షన్ క్యాచ్ చేసింది మూవీ. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడగా.. ప్రస్తుతం డే అండ్ నైట్ షూటింగ్ జరుపుకుంటున్న సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ‘పొన్నియిన్ సెల్వన్’ సాంగ్ షూట్ కంప్లీట్ అయ్యాక.. డైరెక్టర్ మణిరత్నం అండ్ టీమ్‌తో కలిసి ఉన్న బిహైండ్ ద సీన్స్ పిక్ షేర్ చేయడంతో ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచేసింది.

గురు, ట్రూ జీనియస్ మణిరత్నంతో వర్క్ చేయడం ఆనందంగా ఉందని తెలిపిన బృంద మాస్టర్.. ఈ చిత్రానికి రవి వర్మన్ ఫెంటాస్టిక్ విజువల్స్, ఏఆర్ రెహమాన్ సోల్‌ఫుల్ మ్యూజిక్‌ అందించారని తెలిపింది. రెహమాన్ సంగీతానికి కొరియోగ్రఫీ చేయడం అదృష్టంగా ఫీల్ అవుతున్నానని చెప్పింది. తన అసిస్టెంట్‌లను బ్యాక్ బోన్‌గా అభివర్ణించిన ఆమె.. డ్యాన్సర్స్‌ను నిజమైన బలంగా పేర్కొంది.

Advertisement

Next Story