- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కంగనాకు బీఎంసీ షాక్…
దిశ వెబ్ డెస్క్: నటి కంగనా రనౌత్ కార్యాలయంపై బ్రిహత్ ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) అధికారులు దాడి చేశారు. దీనిపై కంగనా స్పందించారు. తన కార్యాలయం గురించి అధికారులకు పూర్తి సమాచారాన్ని ఎప్పుడో తెలిపినట్టు చెప్పారు. కానీ కావాలనే తన కార్యాలయంపై అధికారులు దాడి చేసినట్టు ఆమె తెలిపారు.
కాగా సుశాంత్ సింగ్ కేసులో కంగనా మొదటి నుంచి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పలువురు బాలీవుడ్ పెద్దలపై విమర్శలతో విరుచుకు పడుతున్నారు. ఇక ముంబైని పీఓకే తో పోల్చడంపై దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలకు కంగనా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ముంబైలో కంగనా ఎలా తిరుగుతారో చూస్తామంటూ ఆయన హెచ్చరించారు. కాగా ఆమె ఈ నెల9 న జరిగే ఓ వివాహానికి ఆమె హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు వై క్యాటగిరి భద్రతను కేంద్రం కల్పించింది.
అయితే ముంబైకు కంగనా చేరుకునేలోగానే ఆమె కార్యాలయంపై బీఎంసీ అధికారులు దాడులు చేశారు. ఈ మేరకు అధికారులు దాడి చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కార్యాలయానికి అన్ని అనుమతులు ఉన్నాయని కంగనా తెలిపారు. కావాలనే అధికారులు ఇలాంటి దాడులు చేస్తున్నారని చెప్పారు. కాగా సాధారణ సర్వేల్లో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ కంగనా దగ్గర అనుమతి పత్రాలు ఉంటే చూపిస్తే సరిపోతుందన్నారు. లేనిపక్షంలో కార్యాలయాన్ని కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.