- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఎంసీ కీలక నిర్ణయం
ముంబయి: బ్రిహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంఐ)కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయిలోని షాపింగ్ మాల్స్‌లో అడుగుపెట్టాలంటే కొవిడ్-19 టెస్ట్ రిపోర్టును సమర్పించాల్సిందేనని బీఎంఐ తెలిపింది. ఇక నుంచి మాల్స్ లోకి ప్రవేశానికి కొవిడ్ టెస్టు రిపోర్టును తప్పనిసరి చూపించాలని తెలిపింది. కొవిడ్ రిపోర్టులు అందజేయని వారికి మాల్స్ వద్దే యాంటిజెన్ టెస్టులు నిర్వహించనున్నట్టు తెలిపింది. దీని కోసం ముంబయిలోని అన్ని షాపింగ్ మాల్స్ వద్ద ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల సౌకర్యాన్ని కల్పించనున్నట్టు పేర్కొంది. టెస్టుల నిర్వహణ కోసం ప్రతీ మాల్ వద్ద ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయనున్నట్టు వివరించింది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు బీఎంసీ అదనపు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మార్చి 22 నుంచి అన్ని షాపింగ్ మాల్స్ వద్ద స్వాబ్ కలెక్షన్ సౌకర్యాన్ని తప్పనిసరి చేయనున్నట్టు తెలిపారు. దీని కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు తెలిపారు.