- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయ్యారం బట్టీల్లో బొగ్గుల కొరత.. ఇటుక కాల్చేదెలా..?
దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో సుమారుగా 20 నుంచి 30 వరకు ఇటుక పరిశ్రమలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. అనేక గృహ నిర్మాణదారులకు కల్పతరువుగా కొనసాగుతున్నాయి. గతంలో ఇటుక పరిశ్రమదారులు తమ పరిసర ప్రాంతాల్లో దొరికే కలపను వాడుతూ.. మట్టి ఇటుకలను తయారు చేసి కాల్చేవారు. కానీ, తెలంగాణలో హరితహారం మొక్కలు నాటడం, నరికివేతపై చర్యలు తీసుకుంటుండడంతో.. ఇటుక కాల్చివేత కోసం కలపకు ప్రత్యామ్నాయంగా సింగరేణి సీఎండీ సంస్థకు చెందిన బొగ్గును వినియోగంలోకి తెచ్చారు. పరిశ్రమ అనుమతితో రూ. 60 వేలు డిపాజిట్ చెల్లించి, ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా సింగరేణి సీఎండీ నుంచి ఇటుక పరిశ్రమదారులకు బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు.
డబ్బులు చెల్లించినా.. బొగ్గు పంపిణీలో ఆలస్యం..
కలప వాడకం పక్కనబెట్టిన ఇటుక పరిశ్రమదారులు బొగ్గుపై పూర్తిగా ఆధారపడ్డారు. కానీ, సీఎండీ నుంచి బొగ్గు దిగుమతి కూడా ఆలస్యం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సీఎండీ సంస్థకు ఈఎండీ, జీఎస్టీతో కలిపి సీఆర్ఆర్ అనే బొగ్గు కోసం టన్నుకు రూ. 18 వందల చొప్పన.. ఒక్కొక్క లారీలో 25 టన్నుల లోడ్‌కోసం ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకుని, డబ్బులు కూడా చెల్లించారు. కానీ, రెండు నెలలు గడుస్తున్నా బొగ్గు కొరత కారణంగా బట్టీల వద్దకు కోల్ దిగుమతి కాలేదు. దీనికితోడు ఆన్‌లైన్ బుకింగ్ కూడా రద్దు చేయడంతో ఇటుక పరిశ్రమదారులు, కార్మికులకు ఉపాధి కరువైంది.
బొగ్గు నిల్వలు లేవు..
సీఎండీ విద్యుత్ కేంద్రాల వద్ద సరిపడ బొగ్గు నిల్వలు లేవని, ప్రభుత్వం నుంచి సీఎండీకి బకాయి చెల్లించలేదన్న అపోహల మధ్య ఇటుక పరశ్రమదారులకు బొగ్గు దిగుమతి కావడం లేదు. దీంతో నానా అవస్థలు పడ్డారు. ఇటీవల కొత్త ధరలు అమలులోకి వచ్చాయని చెప్పినప్పటికీ.. వేరే దారి లేక క్వింటాకు రూ. 33 వందలు ఇచ్చి ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్నామని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. అయినప్పటికీ బొగ్గు దిగుమతి ఆలస్యం కావడంతో ఇటు ఇటుక తయారీకి ఆలస్యం అవుతోందని.. ఉత్పత్తి చేసినప్పటికీ అమ్మకాలు ఉండక, ఆర్థిక ఇబ్బందులు వస్తాయంటున్నారు.
పరిశ్రమల్లో తక్షణమే బొగ్గు అవసరం ఉన్నా.. దిగుమతి కావడానికి మరో రెండు, మూడు నెలల సమయం పడుతోందని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు కొరత కారణంగా కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రాకపోగా, పరిశ్రమను నమ్ముకుని పనిచేస్తున్న పలువురి ఉపాధి కరువయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. కనీసం ఇప్పటికైనా చిన్న తరహా పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఇటుక పరిశ్రమదారులు వేడుకుంటున్నారు. వెంటనే సీఎండీ నుంచి బయ్యారంలోని ఇటుక బట్టీలకు బొగ్గు లోడ్ పంపాలని మొరపెట్టుకుంటున్నారు.