కోహ్లీకి అండగా ఫించ్ ఉన్నాడు: బ్రెట్ లీ

by Anukaran |
కోహ్లీకి అండగా ఫించ్ ఉన్నాడు: బ్రెట్ లీ
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌(IPL)లో ఎంతోమంది మంచి ఆటగాళ్లు ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ఒకటి. విరాట్ కోహ్లీ(Virat Kohli), ఏబీ డివిలియర్స్(AB de Villiers), క్రిస్ మోరిస్(Chris Morris), డేల్ స్టెయిన్(Dale Stein), మొయిన్ అలీ(Moin Ali) వంటి ఆటగాళ్లు ఈ జట్టు(Team)లో ఉన్నారు.

గత వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు(Australian player) ఆరోన్ ఫించ్(Aaron Finch) కూడా జత కలిశాడు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ(Captain Virat Kohli)పై బ్యాటింగ్ భారం తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు(Analysts) అంటున్నారు. ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ(Brett Lee) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

స్టార్ స్పోర్ట్స్(Star Sports) నిర్వహించే ‘క్రికెట్ కనెక్టెడ్’(Cricket Connected) కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘యూఏఈ వెళ్లి ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ ఆటను ఆస్వాధించాలని భావిస్తున్నాను. గతంలో అతడే జట్టు భారాన్ని మొత్తం మోసేవాడు. దాంతో ఆ ఒత్తిడి(Pressure) ఆటగాళ్ల ప్రదర్శన(Performance of players)పై పడుతుంది. దీనివల్లనే వాళ్లు విఫలమవుతుంటారు. ఆర్సీబీలోని ఆటగాళ్లంతా కలసికట్టుగా కెప్టెన్‌పై ఉన్న భారాన్ని తొలగించాలి. ఇప్పుడు ఎలాగో ఆరోన్ ఫించ్(Aaron Finch) వచ్చి చేరాడు కనుక అతడు కోహ్లీపై భారాన్ని తగ్గించగలడు. అతడు వైస్ కెప్టెన్‌(Vice Captain)గా మారి కోహ్లీకి అండగా ఉంటాడని భావిస్తున్నా’ అని బ్రెట్ లీ తెలిపాడు. ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఈసారైనా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed