- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ వేలం.. ఐపీఎల్ స్టార్ ప్లేయర్ సురేష్ రైనాకు ఊహించని షాక్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 15వ సీజన్ మెగా వేలం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. టీమిండియా మాజీ ఆటగాడు, ఐపీఎల్ స్టార్ క్రికెటర్ సురేష్ రైనాకు మెగా వేలంలో ప్రాంఛైజ్‌లు భారీ షాక్ ఇచ్చాయి. ఈ మాజీ చెన్నై ఆటగాడు రూ. 2కోట్ల బేస్ ప్రైస్‌తో వేలానికి బరిలోకి నిలిచాడు. అయితే, సురేష్ రైనాను బేస్ ప్రైస్‌కి కొనడానికి కూడా ఏ ప్రాంఛైజ్ ఆసక్తి చూపలేదు. దీనితో రైనా అన్‌సోల్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఊహించని పరిణామానికి ఐపీఎల్ అభిమానులు షాక్‌కు గురి అయ్యారు. ఐపీఎల్‌లో సురేష్ రైనా మోస్ట్ సక్సెస్ ప్లేయర్.. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగవ ఆటగాడిగా రైనా కొనసాగుతున్నాడు. ఈ మెగా వేలం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా జరుగుతుంది. భారీ అంచనాలు ఉన్న ప్లేయర్లు తక్కువ ధరకే అమ్ముడవగా.. తక్కువ బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగిన ఆటగాళ్లు జాక్‌పాట్ కొట్టారు. అయితే ఈ సారి భారీ ధర పలుకుతాడనుకున్నా డేవిడ్ వార్నర్‌ను (6.25cr) తక్కువ ధరకే ఢిల్లీ జట్టు దక్కించుకుంది. టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్ కోసం ప్రాంఛైజ్‌లు పోటీపడ్డాయి. అనుహ్యంగా 10.75 కోట్లకు ఆర్సీబీ హర్షల్ పటేల్‌ను దక్కించుకుంది.
Unsold Player, IPL auction, suresh raina, team india, harshal patel, rcb, csk