- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బట్టలు ఊడదీసి కొడ్తరు.. TRS ఎమ్మెల్యేకు RSP స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నెపునేని నరేందర్‌పై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నెపునేని నరేందర్ నేతన్నలను కలిసి చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని పోస్ట్ కార్టు రాయించారు. ఈ క్రమంలో ఆయన పద్మశాలీలు పవిత్రంగా భావించే చేనేత మగ్గంపై కాలు పెట్టి పత్మశాలీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నరేందర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిడ్డా నన్నపునేని నరేందర్, మా నేతన్నలను ఇంత ఘోరంగా అవమానిస్తవా? అంటూ ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతన్నల మగ్గంపై కాలు పెట్టిన నిన్ను అదే చౌటుప్పల్ చౌరస్తాలో మా నేతన్నలు నేసిన బట్టలూడదీసి శిక్షించేంత వరకు నిద్దరపోం అంటూ హెచ్చరించారు. అన్నలారా, అక్కలారా, ఇంక ఎన్నాళ్లు మనకు ఇట్ల అవమానాలు? అంటూ మునుగోడు ప్రజల పట్ల ఆర్ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడు యుద్ధం పార్టీల మధ్య కాదు
ఆర్ఎస్పీ మరొక ట్వీట్లో మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురింపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీల్లో మునుగోడు-తెలంగాణ బహుజన బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రజలకు చెప్పాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లలో ఉన్న నేతలకు పలు సూచనలందించారు. 'టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లలో అన్నలారా, అక్కలారా, మునుగోడు యుద్దం కేవలం వ్యక్తులు పార్టీల మధ్య లడాయి కాదు, ఇది ఆధిపత్య దొరలు, అణచివేయబడ్డ పేదల మధ్య యుద్దం. ఇండ్ల మనం గెలవాలె' అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్లో పేర్కొన్నారు.