నాసిక్-షిరిడీ హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం

by GSrikanth |   ( Updated:2023-01-13 04:42:43.0  )
నాసిక్-షిరిడీ హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు, ట్రక్కును వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలు కావడంతో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More...

దారుణం: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

Advertisement

Next Story