మంత్రి హరీష్ రావు స్వగ్రామంలో రోడ్డెక్కిన రైతన్నలు

by Shiva |
మంత్రి హరీష్ రావు స్వగ్రామంలో రోడ్డెక్కిన రైతన్నలు
X

స్థానిక రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోవడం లేదంటూ ఆందోళన

తరుగు పేరుతో ఒక్కో లోడ్ పై 10 నుంచి 15 బస్తాల తరుగు తీస్తున్నారని ఆవేదన

దిశ, బెజ్జంకి : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను గ్రామంలో ఉన్న రైస్ మిల్లర్ల యాజమాన్యాలు తీసుకోకపోవడంతో ఆగ్రహం చెందిన రైతన్నలు రాజీవ్ రహదారిపై వరి ధాన్యం సంచులతో రాస్తారోకో చేపట్టారు. ఈ ఘటన ఎక్కడో కాదు.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో చోటుచేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తరుగు పేరుతో లోడ్ కు 10 నుంచి 15 బస్తాల వరకు బస్తాలు కట్ చేస్తున్నారని ఆరోపిచారు. తోటపల్లి గ్రామంలో రెండు రైస్ మిల్లులు ఉన్న ఒక్క లోడ్ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్సై ప్రవీణ్ రాజ్ ఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి ధాన్యం తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు బోయినపల్లి అనిల్, నాంపల్లి శంకర్, పొలవేణి సంపత్, ఉట్ల వెంకటస్వామి, రేవోజూ శ్రీనివాస్, మహిళా రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story