- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం కేసీఆర్ అలా చెప్పి.. వెంటనే రాజీనామా చేయాలి: అరుణ తార
దిశ, కామారెడ్డి: భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను అవమానించిన కేసీఆర్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ మంగళవారం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అరుణ తార మాట్లాడుతూ.. బడ్జెట్ విషయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. మహిళ అని కూడా చూడకుండా కేంద్ర ఆర్థిక మంత్రి పట్ల ఆయన వాడిన పదజాలం బాధకలిగించిందన్నారు. రాష్ట్రంలో పాలన చేత కాక ఎక్కడి వ్యవస్థలు అక్కడ నిర్వీర్యం అవుతుంటే.. సీఎం పదవి కల్పించిన రాజ్యాంగాన్ని మార్చాలంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం విచారకరం అని తెలిపారు. ఇది రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించడమేనన్నారు. ఈ ప్రకటనతో మరో సారి ఆయనలో దాగి ఉన్న నియంత బయటకు వచ్చాడని పేర్కొన్నారు. పాత్రికేయుల సమావేశంలో ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడటం సీఎం స్థాయి వ్యక్తికి సరి కాదని చెప్పారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి మీడియా సమావేశాలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తునాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను అవమానించిన కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.