ప్రమాదంలో మహిళా సింగర్ మృతి.. ఫ్యాన్స్‌ను కన్నీరుపెట్టిస్తున్న వీడియో

by Anukaran |   ( Updated:2021-11-06 00:04:58.0  )
ప్రమాదంలో మహిళా సింగర్ మృతి.. ఫ్యాన్స్‌ను కన్నీరుపెట్టిస్తున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్ : శనివారం ఉదయం చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో బ్రెజిల్‌ పాప్‌ స్టార్‌(సింగర్) మారిలియా మెండోన్సా(26) మృతి చెందారు. ఎంతో ఉత్సాహంగా మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం బయలుదేరిన మారిలియాను విమాన ప్రమాదం బలితీసుకుంది. వివరాల ప్రకారం మెండోన్సా ప్రయానిస్తున్న విమానం మినాస్ గెరైస్ రాష్ట్రంలోని కరాటింగాలో ప్రమాదవశాత్తు కూలి పోయింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు మరో నలుగురు మరణించారు.

26 ఏళ్ల వయసులోనే మెండ్సోనా మరణించడంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదానికి ముందు విమానంలో మెండోన్సా వీడియో ఒకటి అభిమానులను కంటతడి పెట్టిస్తున్నది. అయితే.. బ్రెజిల్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన పాప్‌స్టార్‌ అయిన మెండోన్సా.. ప్రతిష్టాత్మకమైన లాటిన్ గ్రామీ పురస్కారాన్ని 2019లో అందుకున్నారు.

Advertisement

Next Story