బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రత్యేక ఆఫర్!

by Anukaran |
బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రత్యేక ఆఫర్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యూచర్‌గ్రూప్‌ స్టోర్స్ అయిన‌ బ్రాండ్‌ ఫ్యాక్టరీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక షాపింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. వినియోగదారులు వారికి ఇష్టమైన బ్రాండ్లను కొనుగోలు చేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశమని, బ్రాండ్ ఫ్యాక్టరీలో 2 కొంటే 3 ఉచితం అనే ఆఫర్‌ను ప్రారమంభించట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ అగష్టు 16 వరకు అందుబాటులో ఉంటుందని, ఇందులో మొత్తం 200కి పైగా దేశీయ, విదేశీ బ్రాండ్లను తక్కువ ధరలో అందించనున్నట్టు వెల్లడించింది.

అలాగే వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని..నిపుణులైన సిబ్బంది సహకారంతో వినియోగదారులకు వీడియో కాల్ ద్వారా ఇంటి నుంచే సౌకర్యవంతమైన వర్చువల్ షాపింగ్ చేసేందుకు అసిస్టెడ్ షాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు బ్రాండ్ ఫ్యాక్టరీ సీఈవో సురేష్ సద్వాని పేర్కొన్నారు. అలాగే, అత్యుత్తమమైన ఫ్యాషన్ బ్రాండ్లలో.. ఎథ్నిక్ వేర్, కిడ్స్ వేర్ ఇంకా అనేక ట్రేండీ కలెక్షన్ల నుంచి ఎంపిక చేసుకుని ఉత్తమమైన ఆఫర్లతో బ్రాండ్ ఫ్యాక్టరీలో షాపింగ్ చేయచ్చునని సురేష్ సద్వాని వివరించారు.

Advertisement

Next Story