ఏపీ, తెలంగాణ మధ్య వాహనాలకు బ్రేక్

by srinivas |   ( Updated:2023-09-01 15:41:52.0  )
ఏపీ, తెలంగాణ మధ్య వాహనాలకు బ్రేక్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలకు బ్రేక్ పడింది. కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా ఏపీ అంతర్ రాష్ట్ర సరిహద్దులను రేపు ఉదయం ఆరు గంటల వరకు మూసివేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏపీ సరిహద్దులు అయిన గరికపాడు చెక్ పోస్ట్, వాడపల్లి చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. బుధవారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా తెలంగాణ సరిహద్దు అయిన కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తున్న వాహనాలను క్రిష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద నిలిపివేశారు.

ఆంధ్రప్రదేశ్‎లో మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ ఉండడంతో ఎటువంటి వాహనాలు అనుమతించేదిలేదంటూ.. తెలంగాణ నుంచి వచ్చిన వాహనాలను అక్కడే ఆపేశారు. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌ల మూసివేతతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు వ్యవసాయ అనుబంధ రంగాలకు మినహాయింపు ఉంది. విమాన , రైల్వే ప్రయాణికుల టికెట్లు చూపించే వారికి, అలాగే అత్యవసర సేవలు వినియోగించుకునే వాహనాలకు మాత్రమే ఇరు రాష్ట్రాల్లోనికి అనుమతి ఇస్తున్నారు. బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed