‘కరోనా స్కెచ్’ తో అదరగొట్టిన బ్రహ్మానందం

by vinod kumar |
‘కరోనా స్కెచ్’ తో అదరగొట్టిన బ్రహ్మానందం
X

దిశ, వెబ్ డెస్క్ :
స్వతహాగా తెలుగు సాహిత్య నిపుణుడైన బ్రహ్మానందం.. కామెడీ చేయడంలోనే కాదు.. కార్డూన్ లు , బొమ్మలు గీయడంలోనూ ప్రావీణ్యం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. బ్రహ్మానందానికి సాహిత్యమంటే మక్కువ ఎక్కువ. అందులోనూ దిగ్గజ కవి శ్రీశ్రీ పైన ఉన్న ఇష్టంతో ఇటీవలే ఆయన బొమ్మ గీసి ఔరా అనిపించుకున్నారు. బ్రహ్మానందం మట్టితో కూడా విగ్రహాలు తయారు చేస్తుంటారు. లాక్డౌన్ లో తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకుంటున్నారు. తాజాగా ఆయ‌న క‌రోనాపై భార‌త‌దేశం చేస్తున్న పోరుని ఓ స్కెచ్ రూపంలో చూపించారు.

ప్రముఖ హాస్యనటుడు బ్ర‌హ్మానందం తనలోని కళను మరోసారి అందరికీ పరిచయం చేశారు. కామెడీ టైమింగ్ తో అదరగొట్టే బ్రహ్మానందం.. పెన్సిల్ గీతలతో అద్భుతమైన బొమ్మలకు ప్రాణం పోస్తున్నారు. షూటింగ్స్ లో గ్యాప్ దొరికితే.. స్కెచ్ లు వేసే బ్రహ్మానందం లాక్డౌన్ లోనూ తన చేయికి పని చెప్పారు. భారత్ లాక్డౌన్ అనే ఆయుధంతో .. కరోనా వైరస్ కే వణుకు పుట్టించినట్లు తన డ్రాయింగ్ తో చెప్పకనే చెప్పారు. ఈ స్కెచ్ ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ మార్తాండ’ చిత్రంలో నటిస్తున్నారు.

Tags: brahmanandam, lockdown, coronavirus, sketch, drawing

Advertisement

Next Story