మానసిక వ్యాధితో బ్రహ్మానందం కొడుకు.. న్యూ మూవీ షురూ

by Anukaran |   ( Updated:2021-11-20 00:23:22.0  )
మానసిక వ్యాధితో బ్రహ్మానందం కొడుకు.. న్యూ మూవీ షురూ
X

దిశ, వెబ్‌డెస్క్ : పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో అందరిని ఆకట్టుకున్న స్టార్ కమెడీయన్ కుమారుడు గౌతమ్ చాలా రోజుల తర్వాత తెరపై సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పల్లకిలో పెళ్లికూతురు సినిమా అంతగా హిట్టవ్వకపోయినా, అందులో గౌతమ్ పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బసంతి, మను లాంటి డిఫరెంట్ సినిమాలు చేసి నటుడిగా మంచి గుర్తింపు అయితే అందుకున్నాడు గాని కమర్షియల్ గా హిట్స్ అందుకోలేదు. దాంతో సరైన కథల కోసం వెయిట్ చేస్తూ గౌతమ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇంతకాలానికి మరో కథ నచ్చిందేమో మళ్లీ రంగంలోకి దిగిపోయాడు.

గౌతమ్ ఈ సారి కొత్త టీమ్ తో ఒక ప్రయోగం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే గౌతమ్ కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. మోనోఫోబియాతో బాధ పడుతున్న ఓ అప్‌కమింగ్‌ రైటర్‌ తన జీవితానికి ప్రమాదం ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించి బయట పడ్డాడు అనేది ఈ సినిమా స్టోరిలైన్‌గా తెలుస్తోంది. కాగా, ఒక యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్క బోతున్న ఈ మూవీ‌తో సుబ్బు చెరుకూరి దర్శకుడి గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో గౌతమ్ ఫస్టులుక్‌ను కూడా వదిలారు. ఇందులో గౌతమ్ ఒక రైటర్‌గా కనిపించనున్నాడు. మోనోఫోబియా అనే ఒక రకమైన మానసిక వ్యాధితో బాధపడే పాత్రలో ఆయన కనిపించనున్నాడు. ఈ చిత్రానికి శ్రీరామ్‌ మడ్డూరి సంగీతం అందిస్తుండగా, కె సంతోశ్‌ ఎడిటర్‌గా, మోహన్‌ చారి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా బ్రహ్మానందం తనయుడు హీరోగా తొలి విజయం అందుకుంటాడో లేదో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed