హీరోయిన్స్ ఎంపికలో రాజకీయ పార్టీల ప్రమేయం?

by Jakkula Samataha |   ( Updated:2021-03-10 04:13:01.0  )
హీరోయిన్స్ ఎంపికలో రాజకీయ పార్టీల ప్రమేయం?
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఫిల్మ్ ‘అంధాదున్’ మలయాళంలో ‘బ్రహ్మమ్’ పేరుతో రీమేక్ కాబోతుంది. కాగా పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి హీరోయిన్‌ అహానా కృష్ణను కావాలనే తొలగించారంటూ ఆమె తండ్రి, నటుడు కృష్ణ కుమార్ ఆరోపించారు.

ఈ మధ్యే బీజేపీలో చేరిన ఆయన.. పృథ్వీరాజ్‌కు నేషనల్ పార్టీతో ఉన్న సంబంధాలే ఈ చిత్రం నుంచి తన కూతురుని తప్పించేందుకు కారణమని వాపోయారు. మాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ విషయంపైనే తీవ్ర చర్చ జరుగుతుండగా, స్పందించిన అహానా.. దయచేసి ఈ ఇష్యూకు తనను దూరంగా ఉంచాలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోరింది. తను ఈ చిత్రంలో లేనని, ఎవరినీ నిందించలేనని తెలిపింది. దీని గురించి మాట్లాడిన కొందరు తనకు సంబంధించిన వారే కావచ్చు, కానీ అది మరొక వ్యక్తి అభిప్రాయమేనని స్పష్టం చేసింది. ఈ నాటకంలోకి తనను లాగొద్దని, తను ఎప్పటికీ పృథ్వీరాజ్ అభిమానినే అని క్లారిటీ ఇచ్చింది.

రాశీ ఖన్నా, మమతా మోహన్ దాస్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఓపెన్ బుక్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కాగా ఈ విషయంపై నోట్ రిలీజ్ చేశారు మేకర్స్. రాజకీయ అనుబంధాలు ఎప్పటికీ కాస్ట్ అండ్ క్రూను ఎఫెక్ట్ చేయలేవని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed