- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘వర్కౌట్ అయితే ఉండు అన్నాను’’
ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ కుమారుడు ‘‘ఓ పిట్టకథ’’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విశ్వంత్ దుద్దంపూడి, సంజయ్, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ ఓ షోలో మాట్లాడుతూ.. ‘‘తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటే తమ పిల్లల్ని కూడా ఆ రంగంలో పైకి తీసుకురావాలనుకుంటారు. నేను కూడా అలాగే అనుకున్నాను. మా అబ్బాయి సంజయ్ సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు ‘ప్రయత్నించు. వర్కౌట్ అయితే ఉండు. లేకపోతే నీకు నచ్చింది చేసుకో’ అన్నాను ఒక తండ్రిగా ఎంత సహకారం అందించాలో అంత చేశా. తనని సోలో హీరోగా పరిచయం చేయొచ్చు. కానీ, ఒక మంచి పాత్ర ద్వారానే తెలుగు ప్రేక్షుకులకు దగ్గరవ్వాలని ‘ఓ పిట్టకథ’ సినిమా చేశాడు’’ ఈ సినిమాలో నేను ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ పాత్రలో నటించాను. నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఒక అమ్మాయి అదృశ్యం అవుతుంది. ఎలా అదృశ్యం అయింది? అనే కోణంలో నా పాత్ర సాగుతుంది. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
Tags: Brahmaji, O Pitta Katha, Movie, police officer