Angelina Jolie: ఐదేళ్ల న్యాయపోరాటం.. భర్త చేతిలో ఓటమిపాలైన నటి

by Shyam |   ( Updated:2021-05-27 02:36:12.0  )
Angelina Jolie: ఐదేళ్ల న్యాయపోరాటం.. భర్త చేతిలో ఓటమిపాలైన నటి
X

దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ ఐదేళ్ల న్యాయ పోరాటంలో చివరికి ఓటమిని చవిచూసింది. తన భర్త బ్రాడ్ పిట్ తో విడాకులను కోరుతూ ఐదేళ్ల క్రితం కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఐదేళ్ల నుండి సాగుతున్న ఈ న్యాయ పోరాటంలో న్యాయస్థానం బ్రాడ్ పిట్ కి అనుకూలంగా తీర్పునివ్వడంతో ఏంజెలినా ఓటమిపాలయ్యారు. 2014 లో ప్రేమించుకొని ఒక్కటయ్యిన ఈ జంట రెండేళ్లలోనే విడాకులకు సిద్ధమయ్యారు. అప్పటికే వీరికి ఆరుగురు పిల్లలు. ఇక పిల్లల సంరక్షణ తల్లిగా తనకే ఇవ్వాలని కోరుతూ ఏంజెలీనా న్యాయస్థానాన్ని అభ్యర్ధించింది.

కొన్నేళ్లుగా వాయిదాల మీద నడుస్తున్న ఈ కేసులో న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించింది. తమ ఐదుగురు పిల్లల బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరు చూసుకోవాలని సంచలన తీర్పునిచ్చింది. ఇక వారి పెద్ద కొడుకు మాడోక్స్​ కస్టడీ గురించి మాత్రం ఎటూ తేల్చలేకపోయింది. అయితే ఈ తీర్పుపై ఏంజెలీనా మండిపడింది. తనకు న్యాయం జరగలేదని, జడ్జిని బ్రాడ్ పిట్ కొనేశాడని ఆరోపించింది. అందుకే అతనికి అనుకూలంగా తీర్పునిచ్చారని, ఈ తీర్పును తాను ఒప్పుకోవడం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా మరోసారి రీ పిటిషన్ దాఖలు చేస్తానని తెలిపింది.

Advertisement

Next Story