బీపీసీఎల్ కీలక నిర్ణయం..

by Harish |
బీపీసీఎల్ కీలక నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) తన నుమాలీఘడ్ రిఫైనరీలో ఉన్నటువంటి 61.65 శాతం వాటాను విక్రయించనుంది. ఈ వాటా విక్రయం ద్వారా బీపీసీఎల్‌కు రూ. 9,878 కోట్లు సమకూరనున్నాయి. ఈ విక్రయానికి బీపీసీఎల్ బోర్డు సైతం ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ రిఫైనరీలో 49 శాతం వాటాను ఆయిల్ అండ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌కు, 13.65 శాత అసోం ప్రభుత్వానికి విక్రయిస్తామని బీపీసీఎల్ ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ ఎన్ విజయ్ గోపాల్ తెలిపారు.

సోమవారం జరిగిన బీపీసీఎల్ బోర్డు సమావేశంలో కంపెనీకి చెందిన ఈక్విటీ షేర్లను రూ. 10 చొప్పున విక్రయించాలనే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్టు సంస్థ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా, ప్రభుత్వ సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యం నిర్దేశించింది.

Advertisement

Next Story

Most Viewed