గర్ల్ ఫ్రెండ్ నిద్రపోతుండగా ఆమె కనురెప్పలు తెరిచి ఆ పని చేసిన బాయ్ ఫ్రెండ్

by Sumithra |   ( Updated:2021-12-14 10:17:26.0  )
Boyfriend
X

దిశ, వెబ్‌డెస్క్ : నమ్మిన వారే మోసం చేస్తారనడానికి ఇది చక్కటి ఉదాహరణ. ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించిన యువకుడే ఆమెను ఘోరంగా చీట్ చేశాడు. నిద్రపోతున్న ఆమె కనురెప్పలు తెరిచి ఎవరూ ఊహించని విధంగా చేశాడు. టెక్నాలజీనే బోల్తా కొట్టించాను అనుకున్న ఆ ప్రియుడికి నిద్ర నుంచి లేచిన ప్రేయసి గట్టి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఏ జరిగింటే..

చైనాకు చెందిన ఓ యువతీయువకుడు ప్రేమించుకున్నారు. పీకల్లోతో ప్రేమలో ఉన్న వారిద్దరు ఒకరింటికి మరొకరు వచ్చిపోతుండే వారు. అలా ఓ రాత్రి ప్రేయసి ఇంటికి వెళ్లిన ప్రియుడు ఓ కన్నింగ్ పనికి పాల్పడ్డాడు. గ్యాంబ్లింగ్ ఆడే అలవాటు ఉన్న అతడికి అప్పులు అయ్యాయి. వాటికి తీర్చడానికి డబ్బులు లేక.. ప్రియురాలిని మోసం చేశాడు. ఆమె నిద్రపోతున్న సమయంలో ప్రేయసి ఫోన్ ద్వారా డబ్బులు కొట్టేయాలని చూశాడు. అయితే ఆమె మొబైల్‌కు లాక్ ఉండటంలో మొదట ఫింగర్ ప్రింట్ ద్వారా ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది ఫెయిల్ కావడంతో ఫేస్ ఐడీ ద్వారా అన్ లాక్ చేసేందుకు నిద్రపోతున్న ఆమె కనురెప్పలను ఓపెన్ చేసి మొబైల్‌ను తెరిచాడు.

అలా తన అలిపే అకౌంట్‌ను యాక్సెస్ చేసుకున్నాడు. ఆ తర్వాత పాస్ వర్డ్‌లను మార్చి విడతల వారీగా రూ.18 లక్షల(150,000 యునాన్ల)ను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అయితే ఉదయం లేచి చూసిన ప్రియురాలు షాక్‌కు గురైంది. తన డబ్బు మొత్తం ప్రియుడి అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ అయ్యాయని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు అతడికి మూడున్నర ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇలా అటు ప్రియురాలిని, టెక్నాలజీని మోసం చేద్దామనుకున్న ప్రియుడికి షాక్ ఇచ్చారు పోలీసులు.

హైదరాబాదీలే ఆ పనిలో టాప్.. తేల్చిన డేటింగ్ యాప్ సర్వే!

Advertisement

Next Story

Most Viewed