‘తఖ్త్‌’ను బహిష్కరించే తాకత్ ఉందట!

by Shyam |
‘తఖ్త్‌’ను బహిష్కరించే తాకత్ ఉందట!
X

తఖ్త్.. బాలీవుడ్ సినిమా. కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ధర్మ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. వీక్కీ కౌశల్, రణ్ వీర్ సింగ్, జాన్వీ కపూర్, కరీనాకపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం… ఔరంగజేబు, అతని సోదరుడు దరాలు సింహాసనాన్ని దక్కించుకునేందుకు ఎలాంటి పన్నాగాలు పన్నారు? ఎవరు గెలిచారు? వారి మధ్య శత్రుత్వానికి దారి తీసిన కారణాలు ఏంటి? అనేది కథ. అయితే ఈ సినిమాకు హుస్సేన్ హైడ్రీ రైటర్‌గా వర్క్ చేస్తున్నాడు. అంత మంచిస్థానంలో ఉన్న హుస్సేన్ సోషల్ మీడియాలో వివాదానికి తెరతీశాడు. ఈ రెండు పదాలు చాలా ముఖ్యమైనవని.. తప్పకుండా వినియోగించాలి .. అవే ‘హిందూ టెర్రరిస్ట్స్’ అంటూ ట్విట్లర్‌లో పోస్ట్ చేశాడు.

దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కరణ్ జోహార్‌ ఇలాంటి రైటర్‌ను ఎంచుకున్నావా? వెంటనే అతన్ని మూవీ యూనిట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సినిమాను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. #BoycottTakht పేరుతో సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఈ విషయంపై మీ స్టాండ్ ఏంటో చెప్పాలని కరణ్ జోహార్‌ను నిలదీస్తున్నారు నెటిజన్లు. హిందువులను టెర్రరిస్టుల్లా చూపుతూ మీరు సినిమాలు తీస్తే మేమెందుకు చూడాలని ప్రశ్నిస్తున్నారు. అయినా బాలీవుడ్ సినిమాలు ఎప్పుడూ ముస్లింలకు ఫేవర్‌గా ఉంటాయని, ఇంత వివాదాస్పదంగా, హిందువులను కించపరిచేలా డైలాగ్స్ రాసినా అతనికి బాలీవుడ్ బెస్ట్ రైటర్‌గా అవార్డు ఇస్తారని మండిపడుతున్నారు. కరణ్ జోహార్ దీనిపై స్పందించాలని, లేదంటే ఖచ్చితంగా సినిమాను బహిష్కరిస్తామని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు ప్రతీ ఇంటికి కరపత్రాలను కూడా పంచుతామని హెచ్చరిస్తున్నాయి హిందూ సంఘాలు.

ఇంతకు ముందు కూడా హుస్సేన్ హైడ్రీ ఇలాంటి వివాదాస్పదమైన పోస్టులు చాలా పెట్టాడు. హిందువుల్లో ఉన్నత కులాలకు చెందిన మహిళలు నమ్మక ద్రోహానికి పాల్పడతారని చేసిన వ్యాఖ్యలు గతంలోనూ వివాదానికి దారి తీశాయి.

Read also..

డేలో సైట్స్, నైట్ ఫన్‌ కోరుకుంటారు.. కానీ, ఈయనేంటి?

Advertisement

Next Story