- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫిల్మ్‌ఫేర్.. ఫెయిర్ లేదని ఫైర్
బాయ్‌కాట్ ఫిల్మ్‌ఫేర్స్ ఆదివారం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఫిల్మ్ ఫేర్ అవార్డులను బహిష్కరించాలని సినీ అభిమానులు పిలుపునిస్తున్నారు. అసలు మ్యాటరే లేని గల్లీ బాయ్ సినిమాకు 13 అవార్డులు లభించడంపై ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్ బుక్‌లో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంతటి గొప్ప అవార్డుకు విలువ లేకుండా చేశారని జ్యూరీ మెమంబర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పనికిరాని వాటికి గౌరవమిచ్చి, విలువలున్న గొప్ప గొప్ప సినిమాలకు అన్యాయం చేశారని ట్వీట్లలో తిట్టిపోస్టున్నారు.
గల్లీ బాయ్ సినిమాకు బెస్ట్ ఫిల్మ్ అవార్డును దేన్ని పరిగణలోకి తీసుకుని ఇచ్చారో అర్ధమవుతుందా అంటూ జ్యూరీ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. 2019లో వచ్చిన సూపర్ 30, కేసరి, ఉరి : దిసర్జికల్ స్ట్రైక్, చిచ్చోరే లాంటి సినిమాలు వదిలేసి .. గల్లీ బాయ్‌లో ఏం కంటెంట్, కథ ఉందని ఫిల్మ్ ఫేర్ అవార్డు ఇచ్చారని క్వశ్చన్ చేస్తున్నారు. బెస్ట్ యాక్టర్‌గా సూపర్ 30లో హృతిక్ రోషన్ పర్‌ఫార్మెన్స్ నచ్చలేదు కానీ… గల్లీ బాయ్‌లో రణ్‌వీర్ సింగ్ నటన ఎందుకు మెచ్చారు.. ఏముందని బెస్ట్ యాక్టర్‌గా డిసైడ్ చేశారని ట్రోల్స్ చేస్తున్నారు. ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్‌గా గల్లీ బాయ్‌లో అలియాభట్ నటనకు ఇచ్చారా… లేక ఆమె ఇచ్చిన డబ్బుకు అమ్ముడుపోయి ప్రెజెంట్ చేశారా.. అని మండిపడుతున్నారు అభిమానులు.
బెస్ట్ లిరిసిస్ట్ విషయంలో మనోజ్ ముంతాషిర్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. కేసరి సినిమా కోసం తాను రాసిన పాటలో ‘ తూ కహ్తీ థీ తేరా చాంద్ హూ మై ఔర్ చాంద్ హమేషా రహ్తా హై’ లైన్‌ను ప్రస్తావించిన ఆయన మాతృభూమి కోసం రాసిన ఈ పదాలు దేశ ప్రజలకు కన్నీరు తెప్పించాయన్నారు. ‘ఫిల్మ్ ఫేర్ జ్యూరీ నన్ను అవమానించిందని, నా కళను గౌరవించలేద’ని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి ఏ అవార్డు ఫంక్షన్‌కు కూడా హాజరుకానని ప్రకటించారు. నంగా లాంటి అసభ్యకరమైన పాటలను గౌరవించినప్పుడు నాకు అసలు అవార్డే అవసరం లేదన్నారు.
అవార్డు అంటే ఏంటో తెలియని అనన్య పాండేకు బెస్ట్ డెబ్యూ ఫిమేల్‌గా అవార్డు లభించడంపై సినీ లవర్స్ ఆశ్చర్యపోయారు. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్‌లో తాను ఏం నటించిందని .. అసలు నటనలో అఆలు కూడా తెలియని అనన్యపాండేను బెస్ట్‌గా ఎలా సెలెక్ట్ చేశారని మండిపడ్డారు. ఈ విషయంలో కంగనా సోదరి ఘాటు ట్వీటు చేసింది. కేవలం కరణ్ జోహార్ ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టే అనన్య పాండే, అలియాభట్‌లకు అవార్డులు లభించాయని ఆరోపించింది. బాలీవుడ్‌లో నెపోటిజమ్ పీక్స్‌కు చేరిందని, కళను కాసులతో కొన్నప్పుడు అవార్డులు ఎందుకు ఇస్తున్నారని మండిపడింది. ఇదే కొనసాగితే బాలీవుడ్‌లో భవిష్యత్ దిగజారే ప్రమాదముందని అభిప్రాయపడింది.
ఇక చిచ్చోరే సినిమాలో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చి యాసిడ్‌గా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిన క్యారెక్టర్ చేశాడు నవీన్ పాలిశెట్టి. కానీ అతను నామినేషన్స్‌లో కూడా లేకపోవడం ఏంటో అర్థం కావడం లేదు అంటున్నారు అభిమానులు, సినీ విశ్లేషకులు. ఇదే గనుక కొనసాగితే ఆస్కార్ అవార్డు విన్నింగ్ కాదు కదా.. ఆ దరికే చేరలేమని అభిప్రాయపడుతున్నారు.
అసలు ఎందుకిలా జరుగుతుంది? అవార్డులను బహిష్కరించేస్థాయికి ఎందుకు చేరింది? అంటే కారణం కరణ్ జోహార్, యశ్‌చోప్రా, షారుక్‌ఖాన్, ఫరాఖాన్, ఫర్హాన్ అక్తర్ లాంటి వారి జోక్యమే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు విలువ లేకుండా పోయిందంటే కారణం ఖచ్చితంగా వీరే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళను కళగా చూడకుండా నాకు సంబంధించిన వారు అనే పంథాలో వెళ్తున్నారని, తమకు కావాల్సిన వారికే అవార్డులు ఇస్తున్నారనే వాదన వస్తుంది. అవార్డు ఫంక్షన్‌కు వచ్చి డ్యాన్స్ వేశారా? లేదా హోస్ట్ చేశారా? అలా చేయలేదు అంటే అవార్డు లేదు. ఒకవేళ చేశారు అంటే విజేతలు వారే. అదే జరిదింది ఇప్పుడు. కళకు ప్రాధాన్యత ఇవ్వకుండా కళను కళలా చూడకుండా కేవలం బంధుత్వానికే ఓటేసి విన్నర్‌ను డిసైడ్ చేశారన్నది అందరికీ తెలిసిన సత్యమే అంటున్నారు. అలాంటప్పుడు నామినేషన్స్ ఎందుకు? ఇలాంటి కాంట్రవర్సీలకు చోటు ఇవ్వడం ఎందుకు? అసలు అవార్డు ఇవ్వడం ఎందుకు? అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇకనైనా జ్యూరీ మెంబర్స్ మీద ఒత్తిడి తేకుండా వాళ్ల పని వాళ్లను చేసుకోనిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.