చైనా ఉత్పత్తులను బహిష్కరించండి: రాంవిలాస్ పాశ్వాన్

by Shamantha N |
చైనా ఉత్పత్తులను బహిష్కరించండి: రాంవిలాస్ పాశ్వాన్
X

న్యూఢిల్లీ: చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పిలుపునిచ్చారు. రోజువారీగా వినియోగించే వస్తువుల్లోనూ చైనా ఉత్పత్తులు లేకుండా చూసుకోవాలని తన మంత్రిత్వశాఖ అధికారులను ఆదేశించారు. సరిహద్దు ఘర్షణల్లో 20 మంది జవాన్లు వీరమరణం పొందిన నేపథ్యంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ అందరూ ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని సూచించారు. అంతేకాదు, ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తుల నాణ్యతను కఠినంగా పరీక్షించాలని అన్నారు. భారతదేశ బాస్మతి బియ్యం విదేశాలకు చేరినప్పుడు నాణ్యతను పరిశీలించి వెనక్కి పంపిస్తున్నారని, భారతీయులెందుకు ఆ పని చేయొద్దని అడిగారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిబంధనలకు అనుగుణంగా ఆ దేశఉత్పత్తులను పరిశీలించాలని నొక్కిచెప్పారు.

Advertisement

Next Story