పల్లె వెలుగు బస్సు ఢీకొని బాలుడు మృతి

by Aamani |   ( Updated:2021-11-09 08:35:29.0  )
Bus-Colapse1
X

దిశ, గుడిహత్నూర్: పల్లె వెలుగు బస్సు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన గుడిహత్నూర్ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఎక్స్ రోడ్ ప్రాంతానికి చెందిన షేక్ అజిజ్ కొడుకు షేక్ అర్మాన్ (6) రోడ్డు దాటుతుండగా గుడిహత్నుర్ వైపు వస్తున్న ఉట్నూర్ డిపోకి చెందిన పల్లె వెలుగు బస్సు ఢీకొనడంతో నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని బస్సుని అడ్డుకొని బస్సు ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులను సముదాయించి ఉట్నూర్ డిపో రీజినల్ మేనేజర్ కు సమాచారం అందించడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని చికిత్స రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story