- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీనగర్‌లో బాలుడు కిడ్నాప్
by Sumithra |
X
దిశ, ముషీరాబాద్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 సంవత్సరాల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన శివమ్మ అనే మహిళ, తన భర్తతో విడాకులు తీసుకొని జీవనోపాధి కోసం నగరానికి వచ్చింది. ఇందిరాపార్కు సమీపంలోని బండమైసమ్మ నగర్ ఫుట్‌పాత్ పైనే ఉంటూ భిక్షాటన చేస్తూ.. తన కుమారుడు అంజితో కలిసి జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో కొద్ది కాలంగా అదే ప్రాంతంలో యాచకుడిగా ఉంటున్న గణేష్(30)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో వారు కలిసి మెలిసి తింటూ అక్కడే కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం అంజిని తీసుకెళ్లిన గణేష్ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన శివమ్మ గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు గాంధీనగర్ ఇన్ స్పెక్టర్ మోహన్ రావు తెలిపారు.
Advertisement
Next Story