పేరెంట్స్ అలా అన్నారని.. బావిలో శవమై తేలిన బాలుడు

by Sumithra |   ( Updated:2021-09-28 02:35:05.0  )
పేరెంట్స్ అలా అన్నారని.. బావిలో శవమై తేలిన బాలుడు
X

దిశ, చిట్యాల : ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలుడు వ్యవసాయ బావిలో శవమై తేలాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామ శివారులో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జూకల్ గ్రామానికి చెందిన గాజే రాజేష్-విజయ దంపతుల కుమారుడు రామ్ చరణ్ (13) గత రెండ్రోజుల కిందట తల్లిదండ్రులు మందలించారని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రెండు రోజులుగా వెతుకుతున్నా ఆచూకీ లభించలేదు.

సోమవారం జూకల్ గ్రామ శివారులోని బావి దగ్గర రామ్‌చరణ్ చెప్పులు లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చిట్యాల ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలోనూ గజ ఈతగాళ్ల సహాయంతో బావిలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. అదే బావిలో మంగళవారం తెల్లవారు జామున బాలుడు శవమై తేలాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story