- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాటిల్ వాటర్‌తో పర్యావరణానికి హాని : సైంటిస్టులు
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా జనాల్లో హెల్త్ కాన్షియస్ ఎక్కువ అవడంతో బాటిల్డ్ వాటర్‌కు ఇంపార్టెన్స్ పెరిగింది. కొన్నేళ్ల కిందటి వరకు ఫంక్షన్లు, మీటింగ్స్, షాపింగ్ మాల్స్‌కే పరిమితమైనా.. ఇప్పుడు చాలా మంది గృహావసరాలకు కూడా వినియోగిస్తున్నారు. అయితే సాధారణ కుళాయి నీటితో పోల్చినపుడు బాటిళ్ల నీరు.. భూమిపై లభించే సహజ వనరులపై 3,500 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇక ఒక్క ప్లాస్టిక్ బాటిల్‌ను తయారుచేసే ఖర్చుతో మూడు రెట్లు ఎక్కువ నీటిని వెలికితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
బార్సిలోనాకు చెందిన ‘బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ (IS Global)’ ఈ అంశంపై పరిశోధన నిర్వహించింది. ఈ మేరకు నల్లా నీటి కంటే పర్యావరణ వ్యవస్థపై బాటిల్ వాటర్ 1,400 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. నిజానికి బాటిల్డ్ వాటర్‌తో పర్యావరణానికి కలుగుతున్న హాని కంటే మనం పొందే హెల్త్ బెనిఫిట్స్ చాలా తక్కువని వెల్లడించిన పరిశోధకులు.. దీనిపై ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరముందని అన్నారు. పైగా తాగునీటి శుద్ధి ప్రక్రియలో తక్కువ స్థాయిలో ట్రైహాలోమీథేన్స్ (THM) ఉత్పత్తి అవుతుందని, ఇది మూత్రాశయ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. అందుకే పబ్లిక్ ప్లేసెస్, షాపింగ్ మాల్స్‌కు వెళ్లినపుడు ప్రజలకు సొంతంగా వాటర్ తెచ్చుకునే అవకాశాన్ని కల్పించాలని, వీధుల్లోనూ పబ్లిక్ వాటర్ సదుపాయాన్ని కల్పించాలని రీసెర్చర్ సూచించారు.
బాటిల్ తయారీ ఖర్చుతో..
బాటిల్ తయారీ విషయానికొస్తే.. ముడి పదార్థాల వెలికితీత, తయారీ, రవాణా, పంపిణీ, వినియోగంతో పాటు పారవేసే వరకు ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. ఇందుకోసం ఒక్క యూఎస్‌లోనే ప్రతీ సంవత్సరం 1.5 మిలియన్ బారెల్స్ చమురును ఉపయోగిస్తున్నారు. ఇది దాదాపు లక్ష గృహాలకు విద్యుత్ అందించగలదు. ఇక ISGlobal అధ్యయనం ప్రకారం, బార్సిలోనాలోని ప్రతీ నివాసి బాటిల్ వాటర్‌నే వినియోగిస్తే ముడి పదార్థాలను వెలికితీసేందుకు 70 మిలియన్లకు పైగా ఖర్చు అవుతుంది. అంతేకాదు ఇది ఏటా 1.43 జంతు జాతుల నష్టానికి దారితీస్తుంది. తద్వారా పర్యావరణ వ్యవస్థలపై 1400 రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది. వనరుల వెలికితీతకు పర్యావరణానికి 3500 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది.