- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్ : ఇండ్ల పన్ను స్వాహా చేసిన కార్యదర్శి సస్పెన్షన్
దిశ ,చండూరు : లక్షల్లో ఇండ్ల పన్నులు వసూలు చేసి వేల లో గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి పై అధికారులు వేటు వేశారు. ఈనెల 1న దిశ పత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అంతంపేట పంచాయతీ కార్యదర్శి లీలలు ఇంటి పర్మిషన్‌కు నాలుగు వేల నుండి పదివేల వరకు వసూలు అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి 2020 -21 సంవత్సరాలు గాను 5 రసీదు బుక్కులను కట్ చేసి కేవలం 2లక్షల 58 వేల 611 రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు విచారణలో తేల్చారు. కానీ 35, 472 రూపాయలు గ్రామపంచాయతీ ఖాతాలో పంచాయతీ కార్యదర్శి జమ చేసినట్లు విచారణలో తేలింది. దీనిపై దిశ లో వచ్చిన కథనం ప్రకారం అధికారులు విచారణ చేసి పంచాయతీ కార్యదర్శి శ్రీను పై వేటు వేశారు. అవినీతికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శి శ్రీను ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు మర్రిగూడ ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ తెలిపారు.