T Congressలో మహిళా ప్రెసిడెంట్ ఎవరు..?

by srinivas |   ( Updated:2024-11-13 03:07:09.0  )
T Congressలో మహిళా ప్రెసిడెంట్ ఎవరు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. కొత్త అధ్యక్షురాలిని నియమించాలని ఇటీవల ఏఐసీసీ కసరసత్తు మొదలు పెట్టింది. దీంతో ఆ పోస్టు కోసం రాష్ట్రంలోని మహిళా నేతల్లో కొందరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా గద్వాల్ మాజీ జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య, బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డిల మధ్య కాంపిటేషన్ నెలకొన్నది. అయితే బీసీ ఈక్వేషన్‌లో సరితా తిరుపతయ్య పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నదని ఏఐసీసీకి చెందిన ఒక నేత తెలిపారు. సీఎం ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేత ఉండటంతో పీసీసీ చీఫ్, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు బీసీలే ఉండాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన సరితా తిరుపతయ్యేకే దాదాపు ఖరారు చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పైగా పీసీసీ చీఫ్, ఎంపీ మల్లు రవితో పాటు మరి కొందరు నేతల సపోర్టు సరితకే ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

సునీతారావ్‌కు కీలక పదవి!

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతారావ్‌కు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని ఏఐసీసీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆమెకు పదవి కేటాయించిన తర్వాతే స్టేట్‌కు కొత్త మహిళా ప్రెసిడెంట్ ను ప్రకటించాలని ఏఐసీసీ భావిస్తున్నది. ఇక గడిచిన పదేళ్లుగా తెలంగాణలో ఆమె చేసిన ఫైట్, ఆమెపై నమోదైన కేసులు వంటి వివరాలన్నీ ఏఐసీసీ సేకరించింది. కాంగ్రెస్ పార్టీని పవర్‌లోకి తీసుకురావడంలో ఆమె పాత్ర ఉన్నట్లు ఏఐసీసీ బలంగా నమ్ముతున్నది. అంతేగాక దేశ వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ కు లక్ష సభ్యత్వాలు నమోదు కాగా, సునీతరావు ఆధ్వర్యంలో ఒక్క తెలంగాణలోనే 50 వేల మెంబర్ షిప్ లు చేశారు. వీటన్నింటిపై ఏఐసీసీ సాఫ్ట్ కార్నర్ లో పరిశీలిస్తున్నది. ఇక ఏఐఐసీసీ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబ.. సునీతరావుకు సన్నిహితురాలు. ఇప్పటికే సునీతారావుకు పదవి ఇవ్వాల్సిందేనని ఆమె హైకమాండ్ ముందు రిక్వెస్ట్ పెట్టినట్లు తెలిసింది. ఇక తాజాగా అల్కా లాంబ ఇన్‌ చార్జిగా ఉన్న మహారాష్ట్రలోని నియోజకవర్గాల్లో సునీతరావు ఎన్నికల ప్రచారంలో కంటిన్యూగా పాల్గొంటున్నారు.

ఢిల్లీకి లిస్టు.. పేరు ఫైనల్?

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వింగ్ కు నూతన ప్రెసిడెంట్ ను నియమించే పనిలో ఏఐసీసీ నిమగ్నమైంది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసిన మహిళల పేర్లను టీపీసీసీ హైకమాండ్ కు పంపినట్లు తెలిసింది. ఆ పేర్లపై ఏఐసీసీ పలుమార్లు ఇంటర్నల్ గా ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరి పేర్లను ఎంపిక చేసినట్లు తెలిసింది. వాటిలో తాజాగా ఒక పేరును ఫైనల్ చేసినట్లు ఏఐసీసీ నుంచి లీకులు అందాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ప్రకటన ఉంటుందనే గాంధీభవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో మరికొంత మంది మహిళా నేతలు తమకు తెలిసిన నాయకుల ద్వారా మహిళా ప్రెసిడెంట్ పోస్టు కోసం పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed