- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెయిర్ కట్ చేస్తే రూ .5 వేలు జరిమానా
by Shyam |
X
దిశ, సంగారెఢ్డి: జిల్లాలో కరోనా విజృంభిస్తుండటంతో చౌటకూరు గ్రామంలో నాయి బ్రాహ్మణ సంఘం వారం రోజుల కటింగ్ షాపులను మూసివేయడానికి తీర్మానించింది. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8 వరకు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేయాలని తీర్మానించింది. ఎవరైనా దుకాణాలు తెరిచినా, ఇళ్ల వద్దకు వెళ్లి కటింగ్ చేసినా సదరు వ్యక్తుల నుంచి రూ.5000 జరిమానా వసూలు చేయాలని తీర్మానించారు. గ్రామంలోని నాయి బ్రాహ్మణులు ముందుకు వచ్చి తీర్మాన పత్రం పై ఏకగ్రీవంగా సంతకాలు చేశారు. దీంతోపాటు ఎవరికి వారే తమ తమ హెయిర్ కటింగ్ దుకాణాలకు తాళాలు వేశారు. సంఘం చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
Advertisement
Next Story