- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుశాంత్ సింగ్‌ను పొగిడిన బాంబే హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై బాంబే హైకోర్టు ప్రశంసల వర్షం కురిపించింది. సుశాంత్ సిస్టర్స్ ప్రియాంక సింగ్, మీతూ సింగ్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్ ధర్మాసనం.. కేసు ఏదైనా సరే సుశాంత్ సింగ్ అమాయకుడని, తెలివైనవాడని, మంచి వ్యక్తి అని కొనియాడింది. ముఖ్యంగా ఎం.ఎస్.ధోని చిత్రంలో తనను ఇష్టపడని వారుండరని తెలిపింది.
కాగా గతంలో(సెప్టెంబర్ 17, 2020) సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి.. సుశాంత్ సిస్టర్స్‌తో పాటు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ తరుణ్ కుమార్‌పై సబర్బన్ బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సుశాంత్ యాంటిడిప్రెంట్స్ కోసం నకిలీ ప్రిస్క్రిప్షన్ తయారు చేశారని కంప్లైంట్ చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ సుశాంత్ సిస్టర్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం.